బిగ్‌బాస్ సీజన్ 7 వ్యాఖ్యాతగా నందమూరి బాలకృష్ణ వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఆహా ప్లాట్‌ఫాంలో సక్సెస్ఫుల్ అయిన ‘అన్‌స్టాపబుల్’ షోకు బాలయ్య మంచి గుర్తింపు తీసుకొచ్చారు. తన స్టైల్ ఆఫ్ హోస్టింగుతో ప్రేక్షకులను అలరించారు. దీంతో వచ్చే సీజన్లో బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా బాలకృష్ణను తీసుకోనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అన్స్టాపబుల్తో పాటు నాలుగు సినిమాలతో బాలకృష్ణ బిజీబిజీగా గడుపుతున్నారు. మరోవైపు, బిగ్‌బాస్ సీజన్ 6 ఆశించిన మేర రాణించలేదు. దీంతో వ్యాఖ్యాతను మారుస్తున్నట్లు సమాచారం.