నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ టైటిల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ముందుగా ‘అన్నగారు’, ‘వీర సింహారెడ్డి’ అనే టైటిల్స్ అనుకున్నారని, కానీ చివరకు ‘రెడ్డిగారు’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్ నడుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక అప్డేట్ జూన్ 10వ తేదీన బాలయ్య పుట్టినరోజు సందర్భంగా వచ్చే అవకాశముంది.