అడివి శేష్ హీరోగా రూపొందిన ‘హిట్2’ చిత్రం థియేటర్లలో విడుదలై సక్సెస్ బాటలో పయనిస్తోంది. అడివి శేష్ కెరీర్లోనే ప్రారంభ దశలో అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీగా ‘హిట్2’ నిలిచింది. కాగా ఈ చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ, ఆయన తనయుడు మోక్షజ్ణతో కలసి వీక్షించారు. అనంతరం థియేటర్ బయట తండ్రీకొడుకులిద్దరూ సందడి చేశారు. సినిమా చూసిన తర్వాత బాలయ్య, మోక్షజ్ణ, నాని, శేష్ల సెల్ఫీ వైరల్గా మారింది. ‘హిట్2’ సినిమాకు నాని నిర్మాతగా వ్యవహరించారు.