నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీరసింహారెడ్డి’ డైలాగ్స్ వచ్చే ఎన్నికల్లో టీడీపీకి లాభం చేకూర్చేలా ఉన్నాయి. ఏపీలో టీడీపీ-వైఎస్సార్సీపీ మధ్య నెలకొన్న పొలిటికల్ వార్‌ను బాలయ్య తన డైలాగ్‌లతో పతాకస్థాయికి చేర్చాడు. టీడీపీ కార్యకర్తలకు, వైఎస్సార్సీపీ వ్యతిరేకులకు ఈ డైలాగ్స్ ఎక్కడ లేని ఉత్తేజానిచ్చాయి. రాష్ట్రంలో అభివృద్ధి ముసుగులో దోపిడీ, విధ్వంసం, దాడులు, పరిశ్రమలు తరలిపోవడం, వర్సిటీ పేరు మార్పు వంటి అంశాలపై డైలాగ్స్‌తో అదరగొట్టారు.