FM రేడియో చానళ్లలో మద్యం, డ్రగ్స్, ఆయుధాలు, గ్యాంగ్స్టర్ సంస్కృతిని ప్రోత్సహించే పాటలు వేయొద్దని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అలాంటి విషయాలను కూడా ప్రసారం చేయొద్దని నిర్దేశించింది. పలు చానళ్లలో ఇలాంటి పాటలు వస్తున్న నేపథ్యంలో… సంబంధింత శాఖ ఈ మేరకు హెచ్చరించింది. ఇలాంటి పాటల వల్లే పంజాబ్, హరియాణాలో గన్ కల్చర్ పెరిగిందంటూ గతంలో హరియాణా హైకోర్టు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆదేశాలు జారీ చేసింది.