కాంతార సినిమాలోని ‘వరాహరూపం’ పాటపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోర్టు ఆదేశించింది. ఈ ట్యూన్‌ని తమ నుంచే కాపీ చేశారంటూ తెయ్యకుడం బ్రిడ్జ్ వేసిన పిటిషన్‌ని కోజికోడ్ జిల్లా కోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ‘కాంతార’ సినిమాలో వరాహరూపం ట్యూన్ మార్చడంపై ప్రేక్షకులు పెదవి విరిచారు. తాజాగా నిషేధం ఎత్తివేయడంతో ఇక సంబరాలు చేసుకుంటున్నారు. అప్పుడు థియేటర్లు దద్దరిల్లగా.. ఇప్పుడు టీవీలు బద్దలవుతాయని ఊహిస్తున్నారు. అయితే, ఓల్డ్ వెర్షన్‌ని చిత్రబృందం తిరిగి జత చేస్తుందా అన్నది సందేహాస్పదం.
‘వరాహరూపం’ పాటపై నిషేధం ఎత్తివేత
