ఇరాన్ లో ఓ ఐస్ క్రీం యాడ్లు పెను వివాదానికి తెరలేపాయి. యాడ్స్ లో అసలు మహిళలు నిషేధించేలా చేశాయి. మహిళలు ఐస్ క్రీం తింటున్నట్లు ఇటీవల రెండు ప్రకటనలు విడుదలయ్యాయి. అయితే అందులో హిజాబ్ నియమాన్ని నిర్లక్ష్యం చేశారని మతపెద్దలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన ఆ దేశ సాంస్కృతిక శాఖ ఇకపై మహిళలు ఎటువంటి యాడ్స్ లోనూ నటించకూడదని స్పష్టం చేసింది.