కామారెడ్డి కలెక్టరేట్ ముందు నిరసనకు దిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బండి సంజయ్‌ను తీసుకెళ్తున్న వాహనాన్ని బీజేపీ కార్యకర్తలు, రైతులు అడ్డుకున్నారు. పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు. దీంతో కామారెడ్డి కలెక్టరేట్ మార్గంలో ఉద్రిక్తత నెలకొంది. అంతకుముందు ఆత్మహత్య చేసుకున్న రైతు రాములు కుటుంబాన్ని పరామార్శించారు. ఇండస్ట్రీయల్ జోన్ పేరుతో రైతుల పోలాలను ప్రభుత్వం లాక్కుంటోందని ఆయన ఆరోపించారు.