ఎమ్మెల్సీ కవితపై భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలకు నిరసనగా BRS కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దిల్లీలోని తెలంగాణ భవన్ ముందు బీజేపీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. సంజయ్ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ మహిళా ప్రజాప్రతినిధులు జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. కవితపై చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ ఉపసంహరించుకోవాలని మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత డిమాండ్ చేశారు. వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. నీకు అక్కా చెల్లెలు లేరా అని నిలదీశారు.