బండి సంజయ్ పాదయాత్రతో తెలంగాణలో పార్టీకి పెరిగిన జోష్ ను చూసి ఖుష్ అవుతున్న అధిష్ఠానం ఇతర రాష్ట్రాల్లోనూ ఈ తరహా ప్రయత్నాలు చేయాలని ఆలోచిస్తోంది. పార్టీని ముందుకు తీసుకెళ్లడంతో తెలంగాణ మోడల్ ను పరిశీలించిన రాష్ట్రాల నాయకులకు అధిష్ఠానం సూచిస్తోంది. అలాగే తెలంగాణలో అభ్యర్థుల ఎంపికకు గోవా మోడల్ ను అనుసరించాలని సూచిస్తోంది. గెలిచే అభ్యర్థులే తమ ప్రాధాన్యత కావాలని చెబుతోంది.