ప్రో కబడ్డీ 8వ సీజన్ 2022 ముగింపు దశకు చేరుకుంది. వరుసగా 60 రోజుల్లో 132 మ్యాచ్‌ల తర్వాత, VIVO ప్రో కబడ్డీ సీజన్ చివరి సమరానికి సిద్ధం కాబోతుంది. ఈ క్రమంలో తొలి ఎలిమినేటర్‌లో పుణెరి పల్టన్‌తో యూపీ యోధా తలపడగా, యూపీ యోధా పైచేయి సాధించింది. ఇక రెండో ఎలిమినేటర్‌లో బెంగళూరు బుల్స్‌తో గుజరాత్ జెయింట్స్ పోటీపడగా బెంగళూరు బుల్స్ గెలిచింది. ఇక సెమీఫైనల్లో బెంగళూరు బుల్స్, దబాంగ్ ఢిల్లీతో ఈనెల 23న జరిగే మ్యాచ్‌లో తలపడనుంది. మరోవైపు ఇదే రోజు పాట్నా పైరేట్స్, యూపీ యోధా ఫైనల్ కోసం పోటీ పడనున్నాయి. ఈ మ్యాచుల్లో గెల్చినవారికి ఫిబ్రవరి 25న గ్రాండ్ ఫినాలే జరగనుంది.