వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు టోర్నీలో తొలి విజయం కోసం ఎదురుచూస్తోంది. వరుసగా 3 మ్యాచ్‌లు ఓడిపోయిన బెంగుళూరు నేడు యూపీ వారియర్స్‌తో తలపడనుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఈ జట్టు మూడో స్థానంలో కొనసాగుతోంది. బెంగుళూరుపై గెలిచి రన్‌రేట్‌ని మెరుగు చేసుకోవాలని యూపీ అమ్మాయిలు పట్టుదలతో ఉన్నారు. మరోవైపు, ఈ మ్యాచ్‌లో నెగ్గి అపజయాలకు చెక్ పెట్టాలని స్మృతి మంధాన అండ్ టీం సంకల్పంతో ఉంది. బ్రబౌర్న్ స్టేడియం మ్యాచ్‌కి వేదిక కానుంది. రాత్రి 7.30గంటలకు మ్యాచ్ ప్రారంభం.