బంగ్లాదేశ్ సిరీస్ కు మహ్మద్ షమీ స్థానంలో యువ క్రికెటర్ ఉమ్రాన్ మాలిక్ ను బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ప్రాక్టీస్ లో భాగంగా షమీ భుజానికి గాయమయ్యిందని..అతడిని చికిత్స నిమిత్తం నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్తారని చెప్పింది. షమీ స్థానంలో మాలిక్ బంగ్లాదేశ్ వెళ్తారని వెల్లడించింది. ప్రస్తుతం అతడు భారత్ లో ఉండగా ఆదివారం జట్టుతో కలవనున్నాడు. ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లో ఈ స్పీడ్ గన్ అద్భుతంగా రాణించాడు.