ప్రపంచకప్ సూపర్ 12లో బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. నెదర్లాండ్స్‌పై గెలిచి శుభారంభం చేసింది. మొదట బ్యాటింగు చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 144 పరుగులు చేసింది. అనంతరం నెదర్లాండ్స్‌ని ఆరంభంలోనే బంగ్లా బౌలర్ టస్కిన్ దెబ్బకొట్టాడు. వచ్చిన బ్యాటర్‌ని వచ్చినట్లు పెవిలియన్‌కి పంపించాడు. దీంతో 15 పరుగులకే 4 వికెట్లు తీసి నెదర్లాండ్స్‌ని కష్టాల్లోకి నెట్టాడు. దీంతో 20 ఓవర్లలో జట్టును 135 పరుగులకే బంగ్లా ఆలౌట్ చేసి తొలి విజయాన్ని నమోదు చేసింది.
నెదర్లాండ్స్‌పై బంగ్లా విజయం

Courtesy Twitter:T20WorldCup