ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీ 20 సిరీస్‌ను బంగ్లాదేశ్ కైవసం చేసుకుంది. రెండో మ్యాచ్‌లో బట్లర్‌సేనను చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్‌ను కేవలం 117 పరుగలకే ఆలౌట్ చేసింది. టస్కిన్ అహ్మద్ మూడు వికెట్లు తీశాడు. స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్.. నజ్ముల్ హసన్ షాంటో 46 పరుగులతో రాణించి విజయాన్ని అందించాడు. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో రెండింటిలోనూ విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంది.