బంగ్లా ఆర్థిక వ్యవస్థ బానే ఉంది: హసినా

© ANI Photo

శ్రీలంకలా బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ ఎప్పటికీ సంక్షోభంలోకి వెళ్లదని ఆ దేశ ప్రధాని షేక్ హసినా అన్నారు. భారత పర్యటనకు ముందు ANI తో మాట్లాడారు. బంగ్లాదేశ్ తీసుకున్న అప్పులు సకాలంలో చెల్లిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం, కోవిడ్ వల్ల బంగ్లాదేశ్ నష్టపోయిన మాట వాస్తవం. ప్రస్తుతం బంగ్లా ఆర్థిక వ్యవస్థ బానే ఉంది. భారత్ మాకు మిత్రదేశం. ఇరుదేశాల మధ్య నది జలాల వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటాం. చైనా- భారత్ మధ్య విబేధాలు త్వరలోనే పరిష్కారం అవుతాయి అని చెప్పారు.

Exit mobile version