• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పెళ్లి కోసం బ్యాంకుకే కన్నమేసిన ప్రబుద్ధుడు

    పెళ్లంటే నూరేల్ల పంట అని చెబుతారు కొంత మంది. అటువంటి పెళ్లిని చాలా రిచ్‌గా చేసుకోవాలని కలలు కంటూ ఉంటారు. ఇలా పెళ్లికయ్యే ఖర్చును తీర్చుకునేందుకు కర్ణాటకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా బ్యాంకుకే కన్నమేశాడు. ఎవరో బయటి వారు కన్నమేస్తే ఏమో అనుకోవచ్చు. కానీ బ్యాంకులో పని చేసే ఉద్యోగే బ్యాంకుకి కన్నం పెట్టాడు. కర్ణాటకలోని బెళగావి జిల్లా సవదత్తి తాలూకాలని మురుగోడు డీసీసీ బ్యాంకులో క్లర్క్‌గా పనిచేస్తున్న బసవరాజు సిద్ధంగప్ప, అతడి అనుచరులు సంతోష్, గిరీష్ కలిసి బ్యాంకులో ఏకంగా రూ. 6 కోట్ల విలువ గల బంగారం నగలను దోచుకెళ్లారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వీరిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 4 కోట్ల 20 లక్షల నగదును, రూ. 1.63 కోట్ల బంగారు నగలు, కారు, బైకును స్వాధీనం చేసుకున్నారు.