బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్. ఈ నెలలో ఇక 3 రోజులే(ఈరోజు కాకుండా) బ్యాంకులు పనిచేయనున్నాయి. మిగిలిన 8 రోజుల్లో 5 రోజులు బ్యాంకులకు తాళం పడనుంది. ఈ నెల 26న(గురువారం) రిపబ్లిక్ డే ఉండటంతో ఆరోజు సెలవు ఉంటుంది. 28, 29 వరుసగా నాలుగో శనివారం, ఆదివారం కావడంతో ఈరోజుల్లో కూడా బ్యాంకులు బంద్ కానున్నాయి. మరోవైపు, 30, 31న బ్యాంకు యూనియన్లు సమ్మెకు దిగనున్నాయి. ఈ నేపథ్యంలో నెలాఖరులో కూడా బ్యాంకులు తెరుచుకునే అవకాశం లేదు. దీంతో బ్యాంకు సంబంధిత పనులున్న వారు త్వరగా చక్కదిద్దుకోవాలని సూచిస్తున్నారు.