హైదరాబాద్ పాతబస్తీలో వ్యభిచార ముఠాను పోలీసులు గుట్టు రట్టు చేశారు. హుస్సేన్ అనే వ్యక్తి నిస్సహాయ యువతులను ఎంపిక చేసుకుని, వారిని నగ్నంగా ఫొటోలు తీసి, శరీర ఆకృతి ద్వారా ధర నిర్ణయిస్తున్నాడు. ఈ క్రమంలో ఒక సామాజిక కార్యకర్త మరో యువతితో కలసి అతడి గదికి వెళ్లారు. సామాజిక కార్యకర్తను పొట్టిగా ఉన్నావంటూ తిరస్కరించాడు. మరో మహిళను ఎంపిక చేసుకున్నాడు. సమాచారం అందుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు అక్కడకు చేరుకుని అతడిని అరెస్ట్ చేశారు.
న్యూడ్ ఫొటోస్తో బేరం.. శరీరం ఆకృతిని బట్టి ధర

© Envato