బాసర ఆర్జీయూకేటీలో శనివారం రాత్రి నుంచి విద్యార్థులు భోజనం చేయకుండా ఆందోళన కొనసాగిస్తున్నారు. కళాశాల వీసీ వెళ్లి సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చినా విద్యార్థులు శాంతించలేదు. ఇటీవల ఆర్జీయూకేటీలో కలుషిత ఆహారంతో విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అయితే నిర్వాహకుల లైసెన్స్ రద్దు చేయాలని విద్యార్థులు ఆందోళన చేశారు. ఈనెల 24వ తేదీలోపు పరిష్కరిస్తామని ఇన్‌ఛార్జి వీసీ వారికి భరోసా ఇచ్చారు. గడువు ముగిసినా చర్యలు తీసుకోవడం లేదని రాత్రి నుంచి విద్యార్థులు ఆందోళనకు దిగారు.