బ్రెజిల్ రాజధాని బ్రెసిలియాలో విధ్వంసం జరిగింది. మాజీ అధ్యక్షుడు జైరో బోల్సోనారో మద్దతుదారులు బీభత్సం సృష్టించారు. వందల సంఖ్యలో నగరంలోకి చేరుకొని ఆందోళనలు చేశారు. పార్లమెంట్, సుప్రీంకోర్టుపై మెరుపుదాడి చేశారు. అధ్యక్ష ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని..లూలా గద్దె దిగాలంటూ నిరసన తెలిపారు. ఆకుపచ్చ, పసుపు రంగు దుస్తుల్లో జెండాలు చేతబట్టి పార్లమెంట్‌లోకి వెళ్లిన ఆందోళనకారులు..చట్ట సభల కార్యాలయాలను నాశనం చేయటం కలకలం రేపింది.