ప్రపంచకప్ నుంచి టీమిండియా నిష్క్రమణ అనంతరం బీసీసీఐ సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. సెలక్షన్ కమిటీని రద్దు చేసిన అనంతరం తాజాగా మరో ఇద్దరికి ఉద్వాసన పలికింది. క్రికెట్ సలహా కమిటీ(సీఏసీ)లోని ఆర్పీ సింగ్, మదన్లాల్లపై వేటు వేసింది. వీరి స్థానంలో మల్హోత్రా, పరంజపెలను తీసుకుంది. ‘మల్హోత్రా టీమిండియా తరఫున 20వన్డేలు, 4 టెస్టులు ఆడాడు. పరంజపె కూడా 4 వన్డేలు ఆడాడు. సీనియర్ సెలక్షన్ కమిటీలో చేసిన అనుభవం ఉంది’ అని జైషా వెల్లడించారు. కాగా, క్రికెట్ జట్టును ఎంపిక చేసే సెలక్టర్లను సీఏసీ నియమిస్తుంటుంది.