జనవరిలో బీసీసీఐ కొత్త సెలక్షన్ కమిటీ ఏర్పాటుకానున్నట్లు సమాచారం. ఈమేరకు ముగ్గురు సభ్యులతో కూడిన క్రికెట్ సలహామండలి రేపు సమావేశం కానుంది. సెలక్షన్ కమిటీకి అప్లై చేసుకున్న అభ్యర్థుల ఇంటర్వ్యూ గురించి చర్చించనుంది. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ భారత్‌లో జరగనుండటంతో సెలక్షన్ కమిటీ ఎంపిక కీలకంగా మారింది. 2011 ప్రపంచకప్ తర్వాత మెగా ఇవెంట్లలో టిమీండియా స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేదు. ఆసియా కప్, ఇటీవల జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో జట్టు విఫలం కావడంతో చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీని బీసీసీఐ రద్దు చేసిన సంగతి తెలిసిందే.