మే 25 నుంచి రోహిణి కార్తె ప్రారంభంకానుండటంతో ఎండల తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ కార్తెలో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని వెల్లడించారు. దీనికి తోడు అసని తుఫాన్ ప్రభావంతో వాతావరణంలో నీటి ఆవిరి మాయమైందని పేర్కొన్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకి రావొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వేసవి ప్రభావం జూన్ 8 వరకు ఇలాగే కొనసాగే ఛాన్సులు ఉన్నాయని పేర్కొన్నారు.