‘వారితో జర పైలం’ కేంద్రం హెచ్చరిక

© Envato(representational)

కెనడాలో జాత్యాహంకార నేరాలు పెరుగుతున్న వేళ భారత పౌరులను కేంద్రం అప్రమత్తం చేసింది. కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలను, నేరాలను పరిగణలోకి తీసుకున్న భారత ప్రభుత్వం వీటిపై తక్షణమే విచారణ జరపాలని కెనడా ప్రభుత్వాన్ని కోరింది. ఈ తరహా నేరాలు చేసిన వారికి ఇప్పటికీ శిక్ష పడలేదని కేంద్రం నొక్కి చెప్పింది. అలాగే ‘భారత పౌరులు అప్రమత్తంగా ఉండండి’ అంటూ సందేశమిచ్చింది. ఈ యేడాది రెండు హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. కెనడాలో ప్రస్తుతం 16 లక్షల మంది భారత సంతతి వ్యక్తులు ఉన్నారు.

Exit mobile version