సీనియర్ నటి టబు బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్‌తో తన అనుబంధాన్ని అభిమానులతో పంచుకుంది. చిన్నప్పుడు అజయ్ దేవ్‌గణ్ తన కజిన్ సమీర్ ఇంటి దగ్గరే ఉండేవాడని టబు చెప్పారు. అప్పుడు సమీర్, అజయ్ తనపై ఎప్పుడూ నిఘా పెట్టేవారని.. తనతో ఏ అబ్బాయి మాట్లాడినా కొట్టేవారని పేర్కొన్నారు. తాను సింగిల్‌గా ఉన్నానంటే దానికి కారణం ‘అజయ్’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. త్వరలో అజయ్ దేవ్‌గణ్, టబు కాంబినేషన్‌లో దృశ్యం-2, భోళా సినిమాలు వెండితెరపై సందడి చేయబోతున్నాయి.