• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • జ‌న‌సంచారంలోకి ఎలుగుబంటి.. ఆందోళ‌న‌లో ప్ర‌జ‌లు

  వన్యప్రాణులు ఈ మ‌ధ్య త‌ర‌చూ జ‌నసంచారంలోకి వ‌స్తున్నాయి. దీంతో ప్ర‌జ‌లు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. తాజాగా క‌రీంన‌గ‌ర్ లోని రేకుర్తి గ్రామంలో ఓ ఎలుగుబంటి జ‌నాల మ‌ధ్య‌కి వ‌చ్చి ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేసింది. ఆ ప్రాంతంలో ఎలుగుబంటి సంచ‌రించిన ఆన‌వాళ్లు సీసీ కెమెరాల్లో న‌మోద‌వ‌డంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. అటవీశాఖ‌వారికి స‌మాచారం ఇచ్చి దానిని వీలైనంత త్వ‌ర‌గా ప‌ట్టుకునేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామని స్థానిక ఎస్ఐ అన్నారు. కాగా, ఆ ఎలుగుబంటి పొలాల్లో తిరుగుతూ.. కాల‌నీల్లోకి కూడా వ‌స్తోంద‌ని స్థానికులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.