రెండు రోజుల్లో రూ.100 కోట్లు వ‌సూలు చేసిన ‘బీస్ట్’

ద‌ళ‌ప‌తి విజ‌య్, పూజా హెగ్డే జంట‌గా న‌న‌టించిన ‘బీస్ట్’ మూవీ రెండు రోజుల్లో రూ.100 కోట్లు వ‌సూలుచేసింది. సినిమాకు విభిన్న‌మైన టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ క‌లెక్ష‌న్ల‌లో మాత్రం అస్స‌లు త‌గ్గ‌ట్లేదు. త‌మిళ‌నాడులో విజ‌య్ మూవీ స‌ర్కార్ క‌లెక్ష‌న్ల‌ను బీట్ చేసి మొద‌టిరోజు రూ.37 కోట్లు రాబ‌ట్టింది. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా, అనిరుధ్ సంగీతం అందించాడు. బీస్ట్ ఓపెనింగ్ డే క‌లెక్ష‌న్ల‌ను ఒక‌సారి ప‌రిశీలిస్తే
– త‌మిళ‌నాడు: రూ.37 కోట్లు
– క‌ర్ణాట‌క: రూ.7.50 కోట్లు
– ఏపీ /తెలంగాణ: రూ.8 కోట్లు
– కేర‌ళ: రూ.6.50 కోట్లు
– నార్త్ ఇండియా: రూ.2 కోట్లు

Exit mobile version