దళపతి విజయ్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘బీస్ట్’ మూవీ విడుదల తేదీ ఫిక్స్ అయింది. ఏప్రిల్ 13న మూవీ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. అనిరుధ్ సంగీతం అందించాడు. అయితే దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేజీఎఫ్-2 ఏప్రిల్ 14న రిలీజ్ అవుతుండగా..ఒక్కరోజు ముందు బీస్ట్‌ను విడుదల చేస్తుండటం విశేషం.