పూజా హెగ్డే ఇటీవల దళపతి విజయ్‌తో కలిసి నటించిన బీస్ట్ మూవీ అనుకున్నంత సక్సెస్ కాలేదు. దీంతో నిర్మాతలకు భారీగా నష్టం వచ్చినట్లు తెలుస్తుంది. అయితే బీస్ట్‌లో నటించేందుకు పూజా హెగ్డే భారీ రెమ్యునరేషన్ తీసుకుందంట. దీంతో పాటు ఆమె ఎక్కడకి వెళ్లినా హోటల్ ఖర్చులు, ఆమె స్టాఫ్ ఖర్చులు నిర్మాతలే చెల్లించాల్సి ఉంటుంది. ఈ సినిమా సమయంలో కూడా వాళ్ల కోసం చాలా ఖర్చు అయినట్లు సమాచారం. ఇప్పటికే నష్టపోయిన నిర్మాతలు నువ్వు, నీ స్టాఫ్ చేసిన ఖర్చులు నువ్వే చెల్లించుకోవాలని చెప్పి ఆమెకు బిల్లు పంపించారట. మరి ఇది ఎంతవకు నిజమో తెలియదు కానీ ఇండస్ట్రీలో దీనిపై గుసగుసలు వినిపిస్తున్నాయి.