త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ధరకే ఓ అందాల దీవిని సొంతం చేసుకోవచ్చు. మధ్య అమెరికాలో ఉన్న ఇగువానా ఐలాండ్‌ను అమ్మకానికి వచ్చింది. నికరాగువాలోని బ్లూఫీల్డ్స్కు ఈ ఐలాండ్ 20 కి.మీ దూరంలో ఉంటుంది. మొత్తం 5 ఎకరాల విస్తీర్ణంలో చుట్టూ ఎత్తైన అరటి, కొబ్బరి చెట్లతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇందులో విల్లా, స్విమ్మింగ్‌పూల్, ఫిష్ డాక్, వైఫై, టీవీ, ఫోన్ సౌకర్యాలు ఉన్నాయి. రూ.3.76 కోట్లకు దీనిని విక్రయించనున్నట్లు ప్రైవేట్ ఆన్లైన్ వెబ్సైట్ తెలిపింది.