పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ ‘హరిహర వీరమల్లు’. పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి ఓ కీలక పాత్రలో నటించడంతో పాటు ఓ స్పెషల్ సాంగ్ చేయనుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తన డ్యాన్స్, అందంతో అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామా.. ఈ మూవీ కోసం ఈ బ్యూటీ రూ.45 లక్షలు తీసుకుంటుందట. అయితే ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.