ఆంధ్రప్రదేశ్లోని జిల్లాల పునర్విభజన మొదలవడంతో ఆయా జిల్లాల్లోని ఉద్యోగుల విభజనకు ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది. చిత్తూరు జిల్లా ఇన్చార్జి డీఆర్వో రాజశేఖర్ ఆధ్వర్యంలోని ఉద్యోగుల కేటాయింపుకు కమిటీ కూడా ఏర్పాటు చేశారు. పాత జిల్లాలో మొత్తం 95 మంది ఉద్యోగులు ఉండగా.. వారిలో ఎంత మందిని ఉంచాలి, ఎంతమందిని వేరే జిల్లాలకు తరలించాలనేది ఈ కమిటీ నివేదించి ప్రభుత్వానికి తెలపనుంది. కాగా కొత్తగా ఏర్పడనున్న బాలాజీ జిల్లాకు 26 మందిని, రాయచోటి జిల్లాకు 19 మంది ఉద్యోగులను కేటాయించాలని ప్రతిపాదన సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.