ఇండియన్ క్రికెట్ సంబరం IPL. లీగ్ క్రికెట్కు ఓ రేంజ్ పాపులారిటీ వచ్చిందంటే అది IPL వల్లే. ఈ పొట్టి ఫార్మాట్ లీగ్ మొదలైన నాటి నుంచి ఇప్పటిదాకా ఎందరో గొప్ప ఆటగాళ్లు వచ్చారు. అలాంటి వారితో ఓ టీం తయారు చేస్తే ఎలా ఉంటుంది? జియో సినిమాస్లో వస్తున్న ఓ ప్రోగ్రాంలో గేల్, రైనా, స్టైరిస్, పార్థివ్ పటేల్, రాబిన్ ఉతప్ప, అనిల్ కుంబ్లే బృందం ఇలాంటి ఓ జట్టును ఎంచుకుంది. ఆ జట్టు ఎలా ఉందంటే…. క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ,సురేశ్ రైనా, రోహిత్ శర్మ, ఏబీ డివిల్లీర్స్, ఎం.ఎస్. ధోనీ, హార్దిక్ పాండ్యా, సునీల్ నరైన్, యుజ్వేంద్ర చాహల్, జాస్ప్రిత్ బుమ్రా, లసిత్ మలింగ.