ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి శుభాకాంక్షలు వెళ్లువెత్తుతున్నాయి. చిత్రబృందానికి కంగ్రాట్స్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి….ప్రతిష్టాత్మక అవార్డుకు ఒక్క అడుగు దూరంలోనే ఉన్నామని చెప్పారు. అందరీ ప్రార్థనలు ఫలించి మార్చి 12న కల నిజం కావాలని ఆకాక్షించారు. నాటు నాటు పాటకు తన హృదయంలో ప్రత్యేకమైన చోటు ఉంటుందన్న తారక్… కీరవాణి, చంద్రబోస్కు అభినందనలు తెలిపారు. ఇది చిత్రబృందంతో పాటు దేశానికే గర్వకారణమని రామ్ చరణ్ ట్వీట్ చేశారు.