టీమిండియా క్రికెటర్లపై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫి వంటి సిరీస్‌లకు ముందు రంజీ మ్యాచ్‌లు ఆడితే బాగుంటుందని సలహా ఇచ్చాడు. సరైన సన్నద్ధత లేకుండా ఆటగాళ్లు ఆడుతున్నారని విమర్శించారు. అందుకే సామర్థ్యానికి తగిన ఆటతీరు ప్రదర్శించడం లేదని ఆరోపించారు. కాగా BGT-2023లో ఇప్పటికే రెండు టెస్టుల్లో భారత్ విజయం సాధించగా ఒక టెస్టులో ఆసీస్ గెలిచిన సంగతి తెలిసిందే.