బ్రిటన్ ప్రధాని రేసులో UK విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్, రిషి సునక్ మధ్య గట్టి పోటీ కొనసాగుతోంది. ఈ క్రమంలో 90 శాతం లిజ్ ట్రస్ గెలిచే అవకాశం ఉందని బెట్టింగ్ ఎక్స్ఛేంజ్ సంస్థ స్మార్కెట్స్ అంచానా వేసింది. రిషి విజయానికి కేవలం 10 శాతమే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ట్రస్ తన చివరి డిబేట్‌లో ఆయిల్, గ్యాస్ కంపెనీలపై మరింత పన్నులు విధించకూడదని చెప్పింది. ఇవే ఆమె విజయానికి అవకాశాలుగా మారబోతున్నట్లు సమాచారం. ఇక తుది ఫలితాలను సెప్టెంబర్ 5న ప్రకటించనున్నారు.