మోబైల్ రిపేర్ల పట్ల జాగ్రత్త: సైబరాబాద్ పోలీస్

TS: సైబరాబాద్ పోలీసులు సైబర్ నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ ట్వీట్టర్ లో ఓ పోస్ట్ చేశారు. ఇటీవల రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మొబైల్ ఫోన్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానిని రిపేర్ కోసం ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రిపేర్ పూర్తైన తర్వాత ఫోన్ ను ఒకసారి హార్డ్ రీసెట్ చేయాలని సూచించారు. దీనివల్ల ఫోన్లో ఏదైన మాల్వేర్ INSTALL చేసి ఉంటే తొలిగిపోతుందని పేర్కొన్నారు. ఇటీవల కొంతమంది నేరగాళ్లు రిపేర్ కు వచ్చిన ఫోన్లలో మాల్ వేర్లు జోప్పించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. ఇలాంటి సమయాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాగే గొలుసు కట్టు వ్యాపారాల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

Exit mobile version