హైదరాాబాద్ లో మాయ మాటలు చెప్పి దోపిడీలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా HDFC బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి దుండగులు ఓ ఉద్యోగి నుంచి రూ.47,500 లూటీ చేశారు. మాటల్లో పెట్టి ఓటీపీ తెలుసుకుని మనీ కొట్టేశారు. మరో ఘటనలో ధని క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న యువకుడికి ధని భ్యాంక్ వాళ్లమని కాల్ వచ్చింది. ఈ క్రమంలో దుండగులు OTP కూపీ లాగీ రూ.17.500 దోచుకున్నారు. ఇంకో ఘటనలో ప్రసాదం కోసం ఆన్ లైన్లో ఆర్డర్ చేస్తే రూ.50 వేలు బాధితుడి ఖాతాలో ఖాళీ అయ్యాయి. మరో ఘటనలో ఓ వ్యాపార వేత్త తన షాపు అడ్రస్ ను ఆన్ లైన్లో పెట్టాడు. ఆ తర్వాత తనకు 50 కీ బోర్డులు కావాలని ఫోన్ వచ్చింది. ముందుగా వ్యాపారి రూ.5 పంపాలన్నారు. తర్వాత నెట్ బ్యాంక్ వివరాలు తెలుసుకుని రూ.లక్షా 50 వేలు కొట్టేశారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.