డబ్బులు లూటీ చేయడమే లక్ష్యంగా మోసగాళ్లు సరికొత్త పంథాలు ఎంచుకుంటున్నారు. పోలీసులకు కూడ అంతుపట్టని రీతిలో నగదు దోచేస్తున్నారు. తాజాగా హర్యానా రాష్ట్రంలో కొత్త మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ల్యాండ్ రికార్డ్స్‌లోని సదరు యజమాని వేలిముద్రలను టెక్నాలజీ సాయంతో కాపీ చేసి ఆధార్ అనుసంధానంతో ఉన్న బ్యాంకు ఖాతా నుంచి నగదు దోచేస్తున్నారు. ఈ తరహా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో పోలీసుల ల్యాండ్స్ రిజిస్ట్రర్ శాఖకు లేఖ రాశారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వారు పట్టించుకోకపోవడంతో ఈ తరహా మోసాల సంఖ్య పెరుగుతూ వస్తుంది.