కొత్త వైరస్ H3N2 దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నది. మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, ఒడిశా, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ వైరస్ ప్రభావం పిల్లలు, వృద్ధుల్లో అధికంగా కనిపిస్తోంది. ఐదు ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వైరస్ సోకిన పిల్లలలో అధిక జ్వరంతో పాటు ముక్కు కారడం, శ్వాస సంబంధ సమస్యలు తలెత్తుతున్నాయి. యాంటీబయోటిక్స్ వైరస్‌పై పనిచేయడంలేదని వైద్యులు చెప్పారు. పిల్లలకు సొంతవైద్యం చేయవద్దని హెచ్చరిస్తున్నారు. డాక్టర్ల సలహా మేరకు మసలుకోవాలని సూచిస్తున్నారు.