భారత్‌పే కో ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ అష్నీర్ గ్రోవర్ రాజీనామా చేశారు. గత కొంతకాలంగా కంపెనీలో చెలరేగుతున్న వివాదం కారణంగా తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ‘కంపెనీ నుంచి బలవంతంగా రాజీనామా చేయాల్సి వస్తుంది, ఇది నేను బరువెక్కిన గుండెతో తీసుకున్న నిర్ణయం. కొందరు నాపై, నా కుటుంబంపై నిరాధార దాడులు చేస్తున్నారు. భారత్‌పే ప్రపంచంలోని ఫిన్‌టెక్ కంపెనీలలో అగ్రగామిగా నిలుస్తుంది’ అని పేర్కొన్నారు. కాగా కోటక్ మహీంద్రాకు చెందిన ఓ ఉద్యోగిని అష్నీర్ గ్రోవర్ దుర్భాషలాడడంతో ఫిన్‌టెక్ కంపెనీలలో వివాదం మొదలైంది.