పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ భారీ విజయం సాధించింది. ఆ తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న మరో ప్రాజెక్ట్ భవదీయుడు భగత్ సింగ్. దీంతో పవన్ ఫ్యాన్సు ఈ మూవీ కూడా మంచి హిట్టు అవుతుందని భావిస్తున్నారు. ఇదే క్రమంలో ఈ సినిమాలో పవర్ స్టార్ క్యారెక్టర్ గురించి ఓ టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ప్రొఫెసర్ గా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గబ్బర్ సింగ్ లో పోలీస్, వకీల్ సాబ్ మూవీలో లాయర్ పాత్రల్లో నటించి హిట్టు కొట్టారు. అయితే ఈ చిత్రంలో కొత్తగా లెక్చరర్ గా యాక్ట్ చేయనున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.