‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి చేస్తున్ తదుపరి చిత్రం ‘భోళా శంకర్’. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. భారీ కలకత్తా సెట్టును చిత్రబృందం తీర్చిదిద్దింది. అయితే, ఈ సినిమాకు సంబంధించిన వార్తొకటి ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఏప్రిల్ 14న ఈ సినిమా రావట్లేదని టాక్. తొలుత మేకర్లు ఈ సినిమాను ఏప్రిల్ 14న తీసుకొస్తామని ప్రకటించారు. కానీ, చిత్రం షూటింగ్ కాస్త ఆలస్యం కావడంతో మే నెలకి రిలీజ్ వాయిదా వేసినట్లు టాక్. దీనిపై చిత్రబృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది.