ట్రోలర్స్‌కు భువనేశ్వర్‌ భార్య గట్టి జవాబు

ఆస్ట్రేలియాతో 3 టీ20ల సిరీస్‌లో టీమిండియా తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్‌ ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. 19 ఓవర్లో 16 పరుగులు ఇవ్వడం, మొత్తంగా 52 పరుగులు ఇవ్వడంతో అనేక మంది ఈ స్టార్‌ బౌలర్‌ను విమర్శించారు. అయితే ట్రోలర్స్‌కు భువనేశ్వర్‌ భార్య నుపుర్ నగార్‌ గట్టిగా జవాబిచ్చారు. ‘ ఈ మధ్య పనికిమాలిన వాళ్లు ఎక్కువైపోయారు. వారికి ఇతరులపై విషప్రచారం చేయడం తప్ప ఇంకేం పనీ లేకుండా పోయింది. మిమ్మల్ని పట్టించుకునేవాడు ఇక్కడ ఎవరూ లేరు. కనీసం ఆ సమయాన్ని మీరు బాగు పడేందుకు వినియోగించుకోండి. అందుకు అవకాశం తక్కువే అనుకో’ అంటూ పోస్ట్‌ చేశారు. కాసేపటికే ఆ పోస్ట్‌ను ఆమె డిలీట్‌ చేశారు.

Exit mobile version