అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చిక్కుల్లో పడ్డారు. డెలావేర్లోని విల్మింగ్టన్లో ఉన్న బైడెన్ వ్యక్తిగత నివాసంలో ఎఫ్బీఐ సోదాలు చేసింది. 13 గంటల పాటు సాగిన ఈ తనిఖీల్లో 6 రహస్య పత్రాలను ఎఫ్బీఐ స్వాధీనం చేసుకుంది. ఇప్పటివరకు బైడెన్ కార్యాలయాలు, నివాసాల్లో ఎఫ్బీఐ నాలుగు సార్లు దాడులు చేసింది. మొత్తం 18 రహస్య పత్రాలను స్వాధీనం చేసుకుంది. కాగా ఈ పరిణామాలు 2024 ఎన్నికల్లో బైడెన్ అభ్యర్థిత్వానికి చిక్కులు తెచ్చి పెట్టే అవకాశం ఉంది.