అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రష్యా మీద మరిన్ని ఆంక్షలను ప్రకటించనున్నారు. ఇప్పటికే రష్యా మీద అనేక వ్యాపార, ఆర్థిక ఆంక్షలను విధించిన అమెరికా తాజాగా మరిన్ని ఆంక్షలు కూడా విధించాలని యోచిస్తోంది. గురువారం బ్రస్సెల్స్‌లో యురోపియన్ మిత్ర దేశాలతో సమావేశం కానున్న బైడెన్ మరిన్ని ఆంక్షలను విధిస్తారని జాతీయ భద్రతా సహాయకులు తెలిపారు. ఇప్పటికే ఉన్న ఆంక్షలను కఠినంగా అమలు చేసేందుకు, మరిన్ని కొత్త ఆంక్షలను ప్రకటించేందుకు బైడెన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. బైడెన్ బ్రస్సెల్స్, పోలాండ్ లలో పర్యటించనున్నాడు. ప్రపంచదేశాలు ఎన్ని ఆంక్షలు విధించినా కానీ రష్యా మాత్రం తాను ఉక్రెయిన్ మీద చేస్తున్న యుద్ధాన్ని ఆపడం లేదు.