దక్షిణచైనా సముద్రంలో డ్రాగన్ దేశం సైనిక విన్యాసాలు ప్రారంభించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆసియా పర్యటన నేపథ్యంలో చైనా ఈ విన్యాసాలకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. సోమవారం వరకూ సైనిక విన్యాసాలు కొనసాగుతాయని చైనా అధికారులు ప్రకటించారు. ఈ ప్రాంతంలో ఇతర విమానాలకు అనుమతి ఇవ్వడం లేదని అధికారులు పేర్కొన్నారు.