సంక్రాంతికి సినిమాలు విడుదల చేయాలని నిర్మాతలు, హీరోలు తహతహలాడుతుంటారు. పండగ కావడంతో కలెక్షన్లు భారీగా వస్తాయని వాళ్ళ నమ్మకం. ఈ నేపథ్యంలో సంక్రాంతి విడుదలకు కర్చీఫ్ వేస్తూ ఉంటారు. 2023 సంక్రాంతికి కూడా బడా సినిమాలు విడుదల కానున్నాయి. అందులో ప్రభాస్ ‘ఆదిపురుష్’, చిరంజీవి ‘భోళా శంకర్’, మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ, పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’, వంశీ పైడిపల్లి, థళపతి విజయ్ సినిమాలు విడుదల కానున్నాయి. ఇప్పటి వరకు ఆదిపురుష్, హరిహర వీరమల్లు కన్ఫర్మ్ అవగా.. మిగతా సినిమాల అప్డేట్స్ రావాల్సి ఉంది.