ఇండియాలో గడిచిన 24 గంటల్లో 9,923 కరోనా కేసులు వెలుగు చూశాయి. కరోనాతో 17 మంది మృత్యువాత పడ్డారు. కొన్ని రోజులుగా ప్రతి రోజు 10వేల పైచిలుకు కేసులతో భయాందోళనకు గురైన ప్రజలకు ఇది నిజంగా గుడ్ న్యూసే. నిన్న దేశవ్యాప్తంగా 3,88,641 కరోనా టెస్టులు చేశారు. ప్రస్తుతం ఇండియాలో యాక్టివిటీ రేటు 1.21 శాతంగా ఉంది. ఇండియాలో ప్రస్తుతం 79,313 యాక్టివ్ కేసులు ఉన్నాయి.